సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్
seeyoonukanyaa sanbhramapaduchu veeyumu keekal
సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక నీ రాజు భారవాహక మెక్కి బాలస్తోత్రములతో బైలుదేరి వచ్చె ||సీయోనుకన్యా సంభ్రమపడుచు||
హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదులరాజు హెబ్రీయ జనులను అబ్రాము కొడుకులను విభవదేశము జేర్చు శుభరాజు యీతండే ||సీయోనుకన్యా సంభ్రమపడుచు||
హెల్లేనీలోను నీ రాజు పేరు యూదులరాజే యెల్లపాపులఁ బ్రోచు తాల్మిరక్షకుఁడితఁడు చల్లని ప్రభువని గొల్గొత మ్రోగెను ||సీయోనుకన్యా సంభ్రమపడుచు||
ఉర్వి రోమాలో నీ రాజు పేరు యూదులరాజే సర్వరాష్ట్రికులకు బూర్వపితరులతోను వరసింహాసన మిచ్చు వరదేశాధిపుఁ డితఁడు ||సీయోనుకన్యా సంభ్రమపడుచు||
వాసిగ హెబ్రీ హెల్లేనీలో రోమాయిలోను హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సీయ్యదావీదు కొడుకా శ్రీశుభములు ||సీయోనుకన్యా సంభ్రమపడుచు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.