TG-4706
Telugu

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా

Entha Deenaathi Deenamoo Oo Yeesayyaa

0
views
పల్లవి

ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2) నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది 1.  నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2) ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత||

1వ చరణం

2.  నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2) దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత||

2వ చరణం

3.  చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2) ||ఎంత||