TG-207
Telugu

ఎంత గొప్ప బొబ్బ పుట్టెను

entha goppa bobba puttenu

206
views
పల్లవి

ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణ మంతయును సమాప్త మాయెను ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసునకుఁ కల్వరి మెట్టను సంతసముతో సిల్వఁ గొట్టఁగ నూర్యుఁ డంధకారమాయెను ||ఎంత గొప్ప||

1వ చరణం

గలిబిలి గలిగె నొకప్పుడు శిన్యారు బాబెలు కట్టడము కట్టునప్పుడు పలుకు భాషయు నొక్క టైనను పలువిధములగు భాషలాయెను నలుదెసలకును జనులు పోయిరి కలువరి పై కలిసికొనిరి ||ఎంత గొప్ప||

2వ చరణం

పావనుండగు ప్రభువు మనకొరకై యా సిలువమీఁద చావునొందెడు సమయమందున దేవుఁడా నా దేవుఁడా నన్నేల చెయివిడిచితివి యనియా రావముగ మొఱబెట్టెను యె హోవయను దన తండ్రితోను ||ఎంత గొప్ప||

3వ చరణం

అందు దిమిరము క్రమ్ము గడియయ్యొ నా నీతి సూర్యుని నంత చుట్టెను బంధకంబులు నిందవాయువు లెన్నో వీచెను కందు యేసుని యావరించెను పందెముగ నొక కాటువేసెను పాత సర్పము ప్రభువు యేసును ||ఎంత గొప్ప||

4వ చరణం

శాంతమాయె నటంచుఁ బలుకుచును ఆ రక్షకుఁడు తన స్వంత విలువగు బ్రాణమును వీడెన్ ఇంతలో నొక భటుఁడు తనదగు నీటెతోఁ ప్రభు ప్రక్కఁ బొడువఁగ చెంతఁజేరెడి పాపులను ర క్షించు రక్తపు ధారఁ గారెను ||ఎంత గొప్ప||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.