TG-4705
Telugu

ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను

Entha Jaali Yeesuvaa Yinthayani Yoohinchaleenu

0
views
పల్లవి

ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత||

1వ చరణం

హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను (2) అవిశ్వాసినైన నన్ను (2) ఆదరించినావుగా ||ఎంత||

2వ చరణం

రక్షకుండ నాకు బదులు శిక్ష ననుభవించినావు (2) సిలువయందు సొమ్మసిల్లి (2) చావొందితివి నాకై ||ఎంత||

3వ చరణం

ఏమి నీ కర్పించగలను ఏమి లేమి వాడనయ్యా (2) రక్షణంపు పాత్రనెత్తి (2) స్తొత్రమంచు పాడెద ||ఎంత||

4వ చరణం

నీదు నామమునకు యిలలో భయపడెడు వారి కొరకై (2) నాథుడా నీ విచ్చు మేలు (2) ఎంత గొప్పదేసువా ||ఎంత||

5వ చరణం

నేను బ్రతుకు దినములన్ని క్షేమమెల్ల వేళలందు (2) నిశ్చయముగ నీవు నాకు (2) ఇచ్చువాడా ప్రభువా ||ఎంత||

6వ చరణం

నాదు ప్రాణమునకు ప్రభువా సేద దీర్చు వాడ వీవు (2) నాదు కాపరివి నీవు (2) నాకు లేమి లేదుగా ||ఎంత||

7వ చరణం

అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా (2) హల్లెలూయ స్తోత్రములను (2) హర్షముతో పాడెద ||ఎంత||