TG-4703
Telugu

ఎంత కృపామయుడవు యేసయ్య ప్రేమ చూపి

Entha Krupaamayudavu Yeesayya Preema Choopi

20
views
పల్లవి

ఎంత కృపామయుడవు యేసయ్యా (నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2) నలిగితివి వేసారితివి (2) నాకై ప్రాణము నిచ్చితివి (2) ||ఎంత||

1వ చరణం

బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయిన నాదు పాత జీవితం (2) మార్చినావు నీ స్వాస్థ్యముగా (2) ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము (2) ||ఎంత||

2వ చరణం

కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ ఈ లోకము నన్ను విడచిననూ (2) మరువలేదు నన్ను విడువలేదు (2) ప్రేమతో పిలచిన నాథుడవు (2) ||ఎంత||

3వ చరణం

కరువులు కలతలు కలిగిననూ లోకమంతా ఎదురై నిలచిననూ (2) వీడను ఎన్నడు నీ సన్నిధి (2) నీ త్యాగమునే ధ్యానించెదన్ (2) ||ఎంత||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.