TG-4722
Telugu

ఎంత మధురము యేసువాక్యము

Entha Madhuramu Yeesuvaakyamu

16
views
పల్లవి

ఎంత మధురము యేసు వాక్యము నా జీవితకాలమంత నన్ను నడుపును 1.  అలసిసొలసిన సేదదీర్చును కరువు బరువులో ఆదరించును కృంగినవేళ లేవనెత్తును శోధనవేళ జయమునిచ్చును 2.  ఆకలైనను ఆహారమిచ్చును శోకమైనను కన్నీరు తుడుచును చింతలైనను మాన్పివేయును చెంతజేరన సంతోషమిచ్చును 3.  చీకటైనను వెలుగు చూపును పాపినైనను మార్చివేయును వింతప్రేమను బయలుపరచును వెంబడించిన మేలుకలుగును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.