TG-4718
Telugu

ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా

Entha Manchi Deevudavayyaa Entha Manchi Deevudaveesayyaa

14
views
పల్లవి

ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత||

1వ చరణం

ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2) నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత||

2వ చరణం

నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2) ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత||

3వ చరణం

నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2) నీతో కూడా ఈ లోకం నుండీ పరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంత||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.