TG-4720
Telugu

ఎంత మంచి దేవుడవు నా యేసు ప్రభువా నీ మంచినంతటిని

Entha Manchi Deevudavu Naa Yeesu Prabhuvaa Nee Manchinanthatini

13
views
పల్లవి

ఎంత మంచి దేవుడవు నా యేసు ప్రభువా నీ మంచినంతటిని నాపైన చూపావా (2) రాజా నీ బలమును బట్టి సంతసించుచున్నాను నీ రక్షణను బట్టి హర్షించుచున్నాను (2) ఆధారము నీవే యేసయ్యా నా ఆనందము నీవే యేసయ్యా ఆధారము నీవే యేసయ్యా నా ఆనందము నీవే యేసయ్యా ||ఎంత మంచి దేవుడవు||

1వ చరణం

శ్రేయస్కరమైన ఆశీర్వాదమిచ్చావు అపరంజికిరీటముతో అలంకరించావు (2) దీర్ఘాయువుతో గొప్ప మహిమతో నన్ను నింపావు నా యేసయ్య (2) ||ఆధారము||

2వ చరణం

నా కోరికలను సఫలము చేసావు నా ప్రార్థనలను అంగీకరించావు (2) నీ కృప చేత నీ సన్నిధిని ఉల్లసింప చేశావు నా యేసయ్య (2) ||ఆధారము||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.