TG-3364
Telugu

ఎంత మంచి దేవుడవయ్

Entha Manchi Devudavayyaa

19
views
పల్లవి

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2) సంతోషం ఎక్కడ ఉందనీ సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2) జగమంతా వెదికాను జనులందరినడిగాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||

1వ చరణం

ప్రేమనేది ఎక్కడ ఉందనీ క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2) బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||

2వ చరణం

సత్యమనేది ఎక్కడ ఉందనీ నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2) ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2) చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.