ఎంత ప్రేమ నీది యేసయ్యా ఎంత ప్రేమ నీది యేసయ్యా
Entha Preema Needi Yeesayyaa Entha Preema Needi Yeesayyaa
ఎంత ప్రేమ నీది యేసయ్యా ఎంత ప్రేమ నీది యేసయ్యా నన్నెంతగానో నీవు ప్రేమించి నన్నింతగ నిలువబెట్టినావు యేసయ్యా సమస్యలెన్నో అలలవలే ఎగసి పడినా సముద్రమే ఉప్పెనై ముంచజూచినా భయము లేదు నీకని దిగులు చెందవలదని నేనున్నానన్నావు ప్రేమతో భయము లేదు నీకని పైకి లేపి నన్ను నేనున్నానన్నావు ప్రేమతో నా అన్నవారే వంచించి కీడు చేసినా అన్యాయమైన మాటలతో కృంగదీసినా భయము లేదు నీకని నీ పక్షమే నేనని నేనున్నానన్నావు ప్రేమతో న్యాయకర్త నేనని ధైర్యమొందు నీవని నేనున్నానన్నావు ప్రేమతో నా ప్రియులే పగవారై హింసించినా నా నీతినే హేళనగా కించపరిచినా భయము లేదు నీకని కలత చెందవలదని నేనున్నానన్నావు ప్రేమతో సృష్టికర్త నేనని విమోచించి నన్ను నేనున్నానన్నావు ప్రేమతో
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.