TG-3370
Telugu

ఎంతగ నిను కీర్తించినన

Enthaga Ninu Keerthinchinanu

0
views
పల్లవి

ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2) నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పింపగలనా (2) ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2) ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2) నీ ఋణము నే తీర్చగలనా తగిన కానుక నీకు అర్పించగలనా (2) ||ప్రభువా||

1వ చరణం

కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి నా గుడారమునే విశాల పరచి (2) ఇంతగ నను హెచ్చించుటకు నే తగుదునా… నే తగుదునా… వింతగ నను దీవించుటకు నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||

2వ చరణం

నీ నోటి మాట నా ఊటగ నుంచి నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2) ఇంతగ నను వాడుకొనుటకు నే తగుదునా… నే తగుదునా… వింతగ నను హెచ్చించుటకు నేనర్హుడనా… నేనర్హుడనా… ||ప్రభువా||