ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను

enthajaali yeesuvaa yinthayani yuuhinchaleenu

🎵 TG-637💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఎంతజాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంతజాలి యేసువా||

1వ చరణం

హానికరుడ హింసకుడను దేవ దూషకుడను నేను అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ||ఎంతజాలి యేసువా||

2వ చరణం

రక్షకుండా నాకు బదులు శిక్ష ననుభవించినావు సిలువయందు సొమ్మసిల్లి చావొందితి నాకై ||ఎంతజాలి యేసువా||

3వ చరణం

ఏమి నీ కర్పింపగలను ఏమిలేని వాడనయ్య రక్షణంపు పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా ||ఎంతజాలి యేసువా||

4వ చరణం

నీదు నామమునకు యిలలో భయపడెడి వారి కొరకై నాధుడా నీవిచ్చు మేలు ఎంతగొప్ప దేసువా ||ఎంతజాలి యేసువా||

5వ చరణం

నేను బ్రతుకు దినములన్ని క్షేమ మెల్లవేళలందు నిశ్చయముగ నీవు నాకు ఇచ్చువాడా ప్రభూ ||ఎంతజాలి యేసువా||

6వ చరణం

నాదు ప్రాణమునకు ప్రభువా సేదదీర్చువాడ నీవు నాదు కాపరివి నీవు నాకు లేమి లేదుగా ||ఎంతజాలి యేసువా||

7వ చరణం

అందరిలో అతి శ్రేష్ఠుండా అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయా స్తోత్రములను హర్షముతో పాడెదా ||ఎంతజాలి యేసువా||

Report Error