ఎంతమంచిదేవుడ వేసయ్యా
enthamanchideevuda veesayyaa
🎵 TG-1034🌐 Telugu
పల్లవి
ఎంతమంచిదేవుడ వేసయ్యా (2) చింతలన్ని తీరనయ్యా నిన్నుచేరగా - ఎంతమంచిదేవుడ వేసయ్యా నా చింతలన్ని తీరనయ్యా నిన్నుచేరగా - ఎంతమంచిదేవుడ వేసయ్యా
1వ చరణం
గోరపాపినైన నేనూ – నీకు దూరంగా పారిపోగ (2) నీప్రేమతో నన్ను క్షమియించీ – నన్ను హత్తుకొన్నావేసయ్యా (2) ||ఎంతమంచిదేవుడ వేసయ్యా||
2వ చరణం
నాకున్నవారందరూ – నన్ను విడచిపోయిననూ (2) నన్నెంతోఇబ్బందులకు గురిచేసినా –నన్ను నీవు విడువలేదయ్యా (2) ||ఎంతమంచిదేవుడ వేసయ్యా||
3వ చరణం
నీవు లేకుండ నేనూ – ఈలోకంలో బ్రతుకలేనయ్యా (2) నీతో కూడా ఈలోకం నుండీ – పరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంతమంచిదేవుడ వేసయ్యా||