TG-4724
Telugu

ఎంతమంచివాడవు ఎంత గొప్ప దేవుడవు నీకు సాటి ఎవ్వరు లేరయ్యా

Enthamanchivaadavu Entha Goppa Deevudavu Neeku Saati Evvaru Leerayyaa

0
views
పల్లవి

ఎంతమంచివాడవు - ఎంత గొప్ప దేవుడవు నీకు సాటి ఎవ్వరు లేరయ్యా దేవాది దేవుడవు - రాజాధి రాజువు నీవుంటే నాకు చాలయ్యా అ.ప: యెహోవా... యెహోవా... యెహోవా నా కాపరి యెహోవా... యెహోవా... యెహోవా నా ఊపిరి (2) ||ఎంత||

1వ చరణం

పేరుపెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు కన్నీటిని తుడిచావు - కష్టాలే తీర్చావు నీ మాటలో గొప్ప శక్తుందిలే నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేదులే (2) ||యెహోవా||

2వ చరణం

సంద్రాన్ని శాసించి - శాంతింప జేసావే పాపులను స్నేహించి - పవిత్రులుగా మార్చావే నీ పేరంటే దయ్యాలు వణికాయిలే నీవంటే రోగాలు జడిసాయిలే నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేదులే (2) ||యెహోవా||

3వ చరణం

నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే నీతిగా జీవించే - బోధలెన్నో చేశావే కల్వరిలో నీ ప్రేమ చూపావులే కలుషాత్ములెందరినో మార్చావులే నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేదులే (2) ||యెహోవా||

4వ చరణం

Album : Nee vunte Chaalunaya (నీ వుంటే చాలునయా)