TG-4727
Telugu

ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను

Enthoo Bhaagyanbu Shree Yeesu Dorikenu

16
views
పల్లవి

ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను మనకెంతో భాగ్యంబు వింతైన తన మహిమనంత విడచి మన కొరకై చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో||

1వ చరణం

పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యె నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో||

2వ చరణం

బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో||

3వ చరణం

పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు పరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.