TG-4726
Telugu

ఎంతో దుఃఖముఁ బొందితివా

Enthoo Duhkhamun Bondithivaa

0
views
పల్లవి

ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర కెంతో దుఃఖము పొంది తివా యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు ఆ పొంతి పిలాతు యూ దులు నీకుఁ బెట్టిన శ్రమలను దలపోయఁ గా ||ఎంతో||

1వ చరణం

1.  వచ్చిరి యూదులు ముచ్చట లాడుచు నెచ్చట వాఁడనుచు నిన్ను మచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా ||ఎంతో||

2వ చరణం

2.  సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంధులు గట్టినవా నీవు పొందిన బాధ నా డెందము తలఁపనా నందములే దాయెను ||ఎంతో||

3వ చరణం

3.  కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని న్నట్టిట్టు నెట్టుచును వారు పెట్టుశ్రమలు తుద మట్టున కోర్చియుఁ బెట్టితివా ప్రాణము ||ఎంతో||

4వ చరణం

4.  నెపముఁ బెట్టుచుఁ దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టి నారా నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకుఁ జూపినావా ||ఎంతో||

5వ చరణం

5.  చక్కని నా యేసు మిక్కిలి బాధ నీ కెక్కువ గలిగె నయ్యా ఆహా యొక్క దుష్టుఁడీటె ప్రక్కను గ్రుచ్చి తన యక్కస దీర్చుకొనెనా ||ఎంతో||

6వ చరణం

6.  అన్నదమ్ములైన అక్క సెల్లెం డ్రైనఁ కన్న పిత్రాదు లైన నన్ను ఎన్నఁ డైన బ్రేమించలే రైరి నా యన్నా ప్రేమించినావా ||ఎంతో||