TG-302
Telugu

యేసుని సుచరిత మెంత పొనరినది

yeesuni sucharitha mentha ponarinadi

204
views
పల్లవి

యేసుని సుచరిత మెంత పొనరినది యెవ్వరు విని యెద రీ జగతిన్ భాసుర నయ మను బంధము గలిగిన భక్తుల కిది సౌ భాగ్యముగా ||యేసుని సుచరిత||

1వ చరణం

దాసుల మొఱలను దప్పక వినుచును ధైర్యము నొసఁగెడి దాత సుమీ దోసముల గమిఁ ద్రోయ బలముగల దొడ్డ దొరకు నుతి దూతలచేన్ ||యేసుని సుచరిత||

2వ చరణం

పాప నరులఁ గని పావనం బొనర్చను భార మనని ఘన బంధు వుఁడు ఆ పరమ జనకు నాజ్ఞఁ బడసి నెరి యాఢ్యుఁడిడుమ లొందె నుయిలన్ ||యేసుని సుచరిత||

3వ చరణం

సిలువపై నిలచి చేటు వడుచు మరి చివరకు జనకుని చిత్తమునన్ చెలువగ మనవిని జేసెను నరులకు శిక్ష తొలఁగుటకు శ్రీకరుఁడౌ ||యేసుని సుచరిత||

4వ చరణం

పాప రహిత య పార మహిమమున పాత్రమ మరి కుడి పార్శ్వ మునన్ పాపులవిషయము ప్రార్థన మొనర్చెడి భావము గల హిత భాస్కరుఁడౌ నా ||యేసుని సుచరిత||

5వ చరణం

దుషులు ననుఁ గని దూషణ నుడువులు దగ్ధము లనక దూరిన నా ఇష్టుఁడు వడసిన యిడుమలు దలఁచి యించుక పగ మది నెంచను నా ||యేసుని సుచరిత||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.