TG-4732
Telugu

ఎంతో సంతోషమైన దినం యెహోవాయే పంపిన వరం

Enthoo Santhooshamaina Dinan Yehoovaayee Panpina Varan

20
views
పల్లవి

ఎంతో సంతోషమైన దినం యెహోవాయే పంపిన వరం (2) ఉత్సాహాలతో మన మందరం సంగీతాలతో ఆరాధిద్దాం ఇక చేద్దాములే సంబరం (2) పుట్టాడులే పుట్టాడులే ఈ లోక రక్షకుడే తెచ్చాడులే తెచ్చాడులే పరలోక మహిమ నేడే (2) ||ఎంతో||

1వ చరణం

మరియమ్మ గర్భాన మహరాజే పుట్టెను పరమందు దూతల సమూహాలే చేరేను (2) లోకానికి శుభవార్త అపవాదికి దుర్వార్త సాతానికి దడ పుట్టేరోయ్ (2) పుట్టాడులే పుట్టాడులే ఈ లోక రక్షకుడే తెచ్చాడులే తెచ్చాడులే పరలోక మహిమ నేడే (2) ||ఎంతో||

2వ చరణం

యేసయ్య రాకతో లోకమే హర్షించెను గగనాన తారల వెలుగులే విరజిమ్మెను (2) ఈ శుభ సమయనా ఈ రేయి మనలోన నవ్వులే నాట్యము చేసేరోయ్ (2) పుట్టాడులే పుట్టాడులే ఈ లోక రక్షకుడే తెచ్చాడులే తెచ్చాడులే పరలోక మహిమ నేడే (2) ||ఎంతో||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.