TG-4733
Telugu

ఎంతో సుందర జీవితము మహిమతో నిండినది

Enthoo Sundara Jeevithamu Mahimathoo Nindinadi

18
views
పల్లవి

1.  క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను - సీయోను యాత్రలో లోకమున్ విడిచి చేరుకొందును మహిమ దేశమున్ క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములలో మహానందముతో స్తుతించుచు చేరుదు నాదేశమున్ పల్లవి: ఎంతో సుందర జీవితము - మహిమతో నిండినది సదా సర్వదా క్రీస్తుతో నుండి మహిమ పరచెదను - మహిమలో నుండెదను 2.  దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు దాగుచోటు ఆయనే సంకటక్లేశ పరీక్షలలో జయము పొందెదను ప్రభునికై జీవించెదను ఆయన అడుగు జాడలలో ఆత్మ ప్రాణ శరీరము లర్పించి ఆయనను సేవింతును 3.  యాత్రికుడను ఈ జగమందు - పరవాసినైతి నేను స్వల్పజీవితము భువియందు గడిపి - చేరుదున్ ఆ దేశమున్ నాకై విజ్ఞాపనము చేయు - మహాయాజకుడు యేసునితో తోడి వారసుడనై ఆయనతో - నిత్యము ఏలెదను

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.