ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో

enthoo sundarudamma thaanu… enthoo

🎵 TG-2371🌐 Telugu
పల్లవి

ఎంతో సుందరుడమ్మ తాను… ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2)         ||ఎంతో||

1వ చరణం

ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2) అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు అవలీలగా నతని గురితింపగలనమ్మా కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు మరులు మనసున నింపు మహనీయుడాతండు – సిరులు కురిపించేను వర దేవ తనయుండు విరబూయు పరలోక షారోను విరజాజి పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు – కలుషము కడిగిన కమలాల కనుదోయి విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు మేలిమి బంగారు స్థలమందు నిలిపిన చలువ రాతిని బోలు బలమైన పాదాలు మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు – ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. బలవంతుడగువాడు బహుప్రియుడాతండు అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – ఆతని నొరతి మధురంబు మధురంబు ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస

Report Error