TG-4749
Telugu

ఎటు వెళుతున్నావో ఏమవుతున్నావో

Etu Velluthunnaavoo Eemavuthunnaavoo

0
views
పల్లవి

ఎటు వెళుతున్నావో ఏమవుతున్నావో ఈ మాయ లోకంలో పడిపోతున్నావో (2) ఏది నీది అనుకున్నావో నీవే నీ సొంతం కాదని మరిచావో (2) ఓ నేస్తమా యేసుని చేరుమా ఓ ప్రాణమా యేసుని కోరుమా ||ఎటు వెళుతున్నావో||

1వ చరణం

ప్రశ్నే నీదంటూ బదులే నీవంటూ సాగిన నీ పయనం ముగిసిందా ఆశలు అడుగంటి చీకటి కమ్మిందా శాశ్వత వెలుగుంది కానరాదా (2) ఓ నేస్తమా యేసుని చేరుమా ఓ ప్రాణమా యేసుని కోరుమా ||ఎటు వెళుతున్నావో||

2వ చరణం

హద్దులు దాటావు శిలగా మిగిలావు ఒంటరివైనావు నిజము కాదా అంతము ఉందని రక్షణ గైకొని యేసుతో అనునిత్యం సాగిపోవా (2) ఓ నేస్తమా యేసుని చేరుమా ఓ ప్రాణమా యేసుని కోరుమా ||ఎటు వెళుతున్నావో||