TG-023
Telugu

ఎటుల నీకు స్తుతు లొనర్తుము

etula neeku sthuthu lonarthumu

207
views
పల్లవి

ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ యెటుల నీకుఁ నుతు లొనర్తుము పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి మదిని దిటముఁ జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి యేసూ ||ఎటుల నీకు||

1వ చరణం

పాపకూపమందు నుండగాఁ బాపావిమోచ దాపుఁజేర్చి కాపుఁ జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిఁజేయ నీ పవిత్ర రక్తమే నా ప్రాపుగా నొసంగితివి ||ఎటుల నీకు||

2వ చరణం

భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా ||ఎటుల నీకు||

3వ చరణం

నీతిహీనులమై యుండఁగా నో కర్త మాదు బీతులన్నిఁబాపి నీ కృపన్ నీతి రక్షణవస్త్రములను భాతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను ఖ్యాతిగ సేవింపఁజేసితి ||ఎటుల నీకు||

4వ చరణం

నిన్నుఁజేరి నిర్చలుండనై యీ భూమియందు నిన్నుఁ బోలి నడుచుకొనుటకై తిన్నని మార్గమును జూపి అన్ని కీడులను జయింపఁ బన్నుఁగ విమలాత్మశక్తి నున్నతముఁగ నిడిన యేసూ ||ఎటుల నీకు||

5వ చరణం

పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండఁ కరుణతోడ నెంచుకొంటివి తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుఁ త్వరగఁ జేర్చియందు సుఖము దిరముగా నొసంగుదేవ ||ఎటుల నీకు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.