TG-4751
Telugu

ఎటువంటి యాగము జేసితివి యేసు

Etuvanti Yaagamu Jeesithivi Yeesu

16
views
పల్లవి

ఎటువంటి యాగము జేసితివి యేసు నీవలె నేనుండ నా కొరకై 1.  పరమ తండ్రి సన్నిధిన్ బరలోక ప్రణుతింపు విడచితివి పశువుల తొట్టిలో పరుండియు పరమ ప్రేమన్ జూపెను 2.  జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చువరకు మాకై సిలువ బాధ నొందితివి మమ్మును విమోచించన్ 3.  తల వాల్చుటకైనను స్థలమిలలో లేనే లేకుండే నీకు నీయడుగు జాడలలో నేనుండన్ నాముందు వెళ్ళితివి 4.  తమ తల్లి దండ్రులను తమ స్వంతవాటిని విడచిపెట్టి నీ సిలువ మోయు వారెల్లరును నీ మహిమ జూచెదరు 5.  నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి దెచ్చెనిన్ను నీకై నా జీవమెల్ల నియ్యను నీ శ్రమలే నే కోరెదన్ 6.  నా యానంద మీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు నీ వెంట వెళ్ళను నే వెరువను నీ ప్రేమ నాలో నుండ

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.