ఎవరు చేయగలరయ్య నీలాంటి త్యాగము
evaru cheeyagalarayya neelaanti tyaagamu
ఎవరు చేయగలరయ్య నీలాంటి త్యాగము ఎవరు చూపగలరయ్య నీలాంటి ప్రేమను ( 2 ) శాశ్వతమైనది అవధులు లేనిది అమరము అయినది అమూల్యమైనది ( 2 ) నీ ప్రేమకై స్తోత్రము నీ కృపకై వందనము ( 2 ) || ఎవరు ||
నిన్ను దూషించిన వాడనయ్యా నీకు దూరమై పోతినయ్యా నిన్ను ద్వేషించిన వాడనయ్యా నీ దయను కోల్పోతినయ్యా ( 2 ) అయిన నన్ను క్షమియించినావు కృపలోగిలిలో నన్ను దాచినావు ( 2 ) నీ ప్రేమ ఎంతో ఉన్నతం || ఎవరు ||
పాపముతో నేనుండగా అంధకారమే కమ్మియుండగా వాక్యమనే వెలుగుతో నన్ను వెలిగించినావు యేసయ్యా ( 2 ) వెలిగించుమా దివ్య జ్యోతిగా నడిపించుమా నీ సేవలో ( 2 ) మరణము వరకు నాతో ఉండుమా || ఎవరు ||
ఓటి కుండనైనా నన్ను తృణీకరించి విసిరివేయక పనికిరాని వాడనైనా నీ పరిచర్యకు పిలిచావయ్యా ( 2 ) శిల్పకారుడా నన్ను చెక్కుము నీ రూపముకే వచ్చేవరకు ( 2 ) నీ స్వారూప్యము నాలో కలిగేవరకు || ఎవరు ||
