TG-3403
Telugu

ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ

evaru choopinchaleenee - ilaloo nanu veedipoonee

Pranam Kamlakharజాషువు షైక్ · Joshua Shaikమహమ్మద్ ఇర్ఫాన్, అనిఇర్వింహ్య & ఆవిర్భావ · Mohammed Irfan, Aniirvinhya & Avirbhav
2
views
Chorus

ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా

1వ చరణం

తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా ||ఎవరు||

2వ చరణం

ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య ||ఎవరు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.