♪♫
TG-3392
Telugu
ఎవరూ సమీపించలేని
Evaru Sameepinchaleni
17
views
పల్లవి
ఎవరూ సమీపించలేని తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2) నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే (2) ఏమౌదునో నేనేమౌదునో (2) ఇహలోక బంధాలు మరచి నీ యెదుటే నేను నిలిచి (2) నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో||
1వ చరణం
పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి (2) పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో||
2వ చరణం
జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా (2) ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.