TG-2472
Telugu

ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య

evaru unnaa leekunnaa yeesayya

59
views
పల్లవి

ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు (2) అందరి ప్రేమ అంతంత వరకే యేసయ్య ప్రేమ అంతము వరకు (2) ||ఎవరు||

1వ చరణం

కునుకడు నిదురపోడు కాపాడుతాడు నన్నెప్పుడు ఆపదొచ్చినా అపాయమొచ్చినా రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు (2) ||అందరి||

2వ చరణం

తల్లి మరచినా తండ్రి విడచినా నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు ముదిమి వచ్చినా తల నెరిసినా చంక పెట్టుకొని నన్ను మోస్తాడు అలసిన కృషించినా తృప్తి పరచును నన్నెల్లప్పుడు శత్రువొచ్చినా శోధనలు చుట్టినా రెక్కలు చాపి నన్ను కాపాడును

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.