♪♫
TG-3393
Telugu
ఎవరు ఉన్నా లేకున్
Evaru Unnaa Lekunnaa
22
views
పల్లవి
ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు (2) అందరి ప్రేమ అంతంత వరకే యేసయ్య ప్రేమ అంతము వరకు (2) ||ఎవరు||
1వ చరణం
కునుకడు నిదురపోడు కాపాడుతాడు నన్నెప్పుడు (2) ఆపదొచ్చినా అపాయమొచ్చినా (2) రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు (2) ||అందరి||
2వ చరణం
తల్లి మరచినా తండ్రి విడచినా నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు (2) ముదిమి వచ్చినా తల నెరిసినా (2) చంక పెట్టుకొని నన్ను మోస్తాడు (2) ||అందరి||
3వ చరణం
అలసిన కృషించినా తృప్తి పరచును నన్నెల్లప్పుడు (2) శత్రువొచ్చినా శోధనలు చుట్టినా (2) రెక్కలు చాపి నన్ను కాపాడును (2) ||అందరి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.