TG-4861
Telugu

గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో

Gaadhaandha Kaaramuloo Nee Nadichina Veellalaloo

14
views
పల్లవి

గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో కంటి పాపవలె నన్ను కునుకాక కాపడును ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్ జడియను బెదరను నా యేసు నాతో నుండగా మరణపు లోయలలో నే నడచిన వేళలలో నే దుడ్దు కర్రయు నీ దండము ఆదరించును శుధాత్మతో నింపును నా గిన్నె పొర్లు చున్నది జడియను బెదరను నా యేసు నాతో నుండగా అలలతో కొట్టబడినా నా నావలో నేనుండగా ప్రభు యేసు క్రుప నన్ను విడువక కాపాడును అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును జడియను బెదరను నా యేసు నాతో నుండగా పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నీ క్రుప నను విడువదు నీ కనికరం తొలగదు నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును జడియను బెదరను నా యేసు నాతో నుండగా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.