గానముఁ జేయుఁడు సుకీర్తనను యెహోవాను

gaanamum jeeyumdu sukeerthananu yehoovaanu

🎵 TG-002💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

గానముఁ జేయుఁడు సుకీర్తనను యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను ||గానముఁ జేయుఁడు||

1వ చరణం

తన్నామము నుతించి యతని రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను జాటండి ||గానముఁ జేయుఁడు||

2వ చరణం

ఘనతయు మహత్మ్యమును దద్ఘనని యెదుటనుండు ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానముఁ జేయుఁడు||

3వ చరణం

పరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానముఁ జేయుఁడు||

4వ చరణం

పరిపాలించుచున్నాఁడనుచు తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానముఁ జేయుఁడు||

5వ చరణం

ఏమనిన నా మహాత్ముండు వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానముఁ జేయుఁడు||

6వ చరణం

జనులారా యా యెహోవాకు మహిమను బలమును సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానముఁ జేయుఁడు||

Report Error