TG-4864
Telugu

గాయపడిన నీ చేయి చాపుము దేవా

Gaayapadina Nee Cheeyi Chaapumu Deevaa

14
views
పల్లవి

గాయపడిన నీ చేయి చాపుము దేవా నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2) సిలువే నాకు విలువైనది (2) అదియే నా బ్రతుకున గమ్యమైనది ఎంతో రమ్యమైనది ||గాయపడిన||

1వ చరణం

ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె నీవు ఎదిగితివి (2) సురూపమైనా ఏ సొగసైనా (2) లేనివానిగా నాకై మారితివి ||గాయపడిన||

2వ చరణం

మనుషులందరు చూడనొల్లని రూపముగా నాకై మారితివి (2) మా రోగములు మా వ్యసనములు (2) నిశ్చయముగా నీవు భరియించితివి ||గాయపడిన||

3వ చరణం

నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత నాకు కలిగినది (2) నీవు కార్చిన రక్తమే (2) మా అందరికీ ఇల ప్రాణాధారము ||గాయపడిన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.