TG-4865
Telugu

గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం

Gaayapadinappudu Nee Naamamee Upashamanan

14
views
పల్లవి

గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం - బాధపడినప్పుడు నీ హస్తం అభయం సూర్యచంద్రులను తలదన్నే కాంతిపుంజమా - సర్వసృష్టిని సృష్టించిన రక్షణ శృంగమా హలెలుయా లాలలలలా హలెలుయా లాలలలలా హలెలుయా హలెలుయా ||గాయపడినప్పుడు||

1వ చరణం

నా జీవితమంతయు నీ సాక్షిగా నిలచెదన్ - నీ జీవవాక్యమును ప్రకటించేదన్ వర్ణింపగలదగునా నీ ఘనచరితను - వివరింపదగుదునా నీ ప్రేమ హృదయం హలెలుయా లాలలలలా హలెలుయా లాలలలలా హలెలుయా హలెలుయా ||గాయపడినప్పుడు||

2వ చరణం

నా క్రియలను దిద్దుచు నా పాపమే కడుగుచు - నా కోసమే నీవు బలియైతివి బంగారు కంటెను అపరంజికంటెను- నీ ఆజ్ఞలు ప్రియముగా వున్నవి హలెలుయా లాలలలలా హలెలుయా లాలలలలా హలెలుయా హలెలుయా ||గాయపడినప్పుడు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.