గడచిన కాలము కృపలో మమ్ము - కాచిన దేవా నీకే స్తోత్రము

gadachina kaalamu krupaloo mammu - kaachina deevaa neekee sthoothramu

🎵 TG-1052🌐 Telugu
పల్లవి

గడచిన కాలము కృపలో మమ్ము - కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము (2) మము కాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||

1వ చరణం

కలచెందినా కష్ట కాలమున - కన్న తండ్రివై నను ఆదరించినా కలుషము నాలొ కానవచ్చిన - కాదనక నను కరుణించినా (2) కరుణించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము ||గడచిన||

2వ చరణం

లోపములెన్నో దాగివున్నను - కాదనకా నను నడిపించినా అవిదేయతలే ఆవరించినా - దీవెనలెన్నో దయచేసినా (2) దీవించిన దేవా నీకే స్తొత్రముల్‌ కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము (2) ||గడచిన||

Report Error