TG-4847
Telugu

గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా

Gaganaana Thaaraka Bhuvanaana Vaalegaa Vinthaina Vaartha Cheppagaa

16
views
పల్లవి

గగనాన తారక భువనాన వాలెగా వింతైన వార్త చెప్పగా భయమేది లేదిక భారం తొలగిందిగా శ్రీ యేసు రాజుపుట్టగా పరలోక తండ్రి ప్రేమగా తన వారసుణ్ణి పంపగా భూలోక వాసులందరికి శుభవార్త పండుగా రారే జనాంగమా కనులారా చుద్దామా సాంబ్రాణి బోళమర్పించి యేసుని సేవిద్దామా పరలోక వాసుడు పరిశుద్ధ దేవుడు తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడూ గగనాన పరలోక పుత్రుడు పరాక్రమశీలుడు పశుశాలలో పసిబాలుడై నిశిరాత్రిలో శ్రీయేసుడు (2) అన్ని నామాలకన్నా పైనున్నవాడు తన రాజ్యస్థాపనకై సామాన్యుడైనాడూ ||రారే||

1వ చరణం

మనరక్షణార్ధమై మనుజావతారుడై మహిమోన్నత స్థలములు వీడి ఈ నేలపై వెలిసాడు (2) రాజాధిరాజు అతడు రాజసం వీడినాడు మన హృదయ లోగిలిలో చోటుచాలన్నాడు ||రారే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.