♪♫
TG-3406
Telugu
గగనము చీల్చుకొని
Gaganamu Cheelchukoni
0
views
పల్లవి
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానైయున్న ప్రాణప్రియుడా యేసయ్యా (2) నిన్ను చూడాలని… నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2) ఉల్లసించుచున్నది… ||గగనము||
1వ చరణం
నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2) పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను (2) నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) ||గగనము||
2వ చరణం
నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2) కళంకములేని వధువునై – నిరీక్షణతో నిన్ను చేరెదను (2) యుగయుగాలు నీతో ఏలెదను (2) ||గగనము||
3వ చరణం
నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2) అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో (2) సీయోనులో నీతో నేనుందును (2) ||గగనము||