TG-649
Telugu

గగనము చీల్చుకొని యేసు ఘనులను

gaganamu cheelchukoni yeesu ghanulanu

206
views
పల్లవి

గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని వేలాది దూతలతో భువికి వేగమె రానుండె

1వ చరణం

పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధరసంఘ వధువునకై తరలెను వరుడదిగో ||గగనము చీల్చుకొని||

2వ చరణం

మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను కొదమసింహపురీతి కదలెను గర్జనతో ||గగనము చీల్చుకొని||

3వ చరణం

కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు ||గగనము చీల్చుకొని||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.