♪♫
TG-4857
Telugu
గలిలయ తీరాన చిన్ననావ
Galilaya Theeraana Chinnanaava
14
views
పల్లవి
గలిలయ తీరాన చిన్న నావ యేసయ్య ఏర్పరచుకున్న నావ (2) యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా ||గలిలయ||
1వ చరణం
యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించిన (2) ఆత్మల సంపాదనకై వాడబడిన ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా ||గలిలయ||
2వ చరణం
సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2) ఆగకుండా ముందుకే కొనసాగిన అలుపెరగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా ||గలిలయ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.