గమ్యం చేరాలని నీతో ఉండాలని

gamyam cheeraalani neethoo undaalani

🎵 TG-2368🌐 Telugu
పల్లవి

గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూ రేయి పరవశించాలని ఈ నింగి నేలా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని||

1వ చరణం

భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్ని సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను||

2వ చరణం

అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండినా నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని

Report Error