♪♫
TG-2138
Telugu
గతకాలమంత నీ నీడలోన దాచావు
gatakaalamanta nee needaloona daachaavu
Enoch Jaganదివ్య మన్నె · Divya Manne
68
views
పల్లవి
గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు – కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత||
1వ చరణం
ఎన్నెన్నో అవమానాలెదురైననూ నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగిననూ నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము ||గతకాలమంత||
2వ చరణం
మాటలే ముళ్ళుగ మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నను తాకెనయా నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట ||గతకాలమంత||
