TG-650
Telugu

గీతం గీతం జయ జయగీతం

geetam geetam jaya jayageetam

207
views
పల్లవి

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2)

1వ చరణం

చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు ||గీతం||

2వ చరణం

వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ||గీతం||

3వ చరణం

అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి ||గీతం||

4వ చరణం

గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ వేళతాళ వాద్యముల్ బూరలెత్తి ధ్వనించుడి ||గీతం||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.