TG-4872
Telugu

గీతములు పాడుఁడీ యేసునికి సంగీతములు పాడుఁడీ

Geethamulu Paadundee Yeesuniki Sangeethamulu Paadundee

16
views
పల్లవి

గీతములు పాడుఁడీ యేసునికి సంగీతములు పాడుఁడీ పాతకుల మగు మనల దారుణ పాతకము తన విమలరక్త స్నాతులనుగాఁ జేసి పాపను భాతకులలో నవతరించెను ||గీతములు||

1వ చరణం

1.  రాజులకు రాజుగా నేలుచు మోక్ష రాజ్యమున కర్తగా బూజలందుచు దూత పరిగణ పూజితుండౌ ఘనుఁడు తన దగు తేజ మెల్లను విడిచి యీయిలఁ దేజహీనులలోనఁ బుట్టెను ||గీతములు||

2వ చరణం

2.  దాసులగు వారలన్ దమ పటు దోష త్రాస విముక్తులన్ జేసి వారల నెల్ల మోక్ష ని వాసులుగఁ జేయంగ రక్తముఁ బోసి కృపచేఁగావ వచ్చెను యేసు నాధుఁడు దీన వృత్తిని ||గీతములు||

3వ చరణం

3.  మానవుల కెల్లను దేవుని ప్రేమ మానుగాఁ జూపను మ్రానిపై దన రక్త మొసఁగఁగ మానవుండై పుట్టె యూదుల లోన యేసను పేరుచేఁదా దీనుఁడై యిమ్మానుయేలు ||గీతములు||

4వ చరణం

4.  ఆదిఁ దన వాక్యము నందున యేసు మోదమున్ నిట్లనెన మేదినిందా మనుజుఁడై యిఁక సాదరమ్మునఁ బ్రోవ మనుజుల నా దయాళుఁడు తనదు దేహము సాధుగా నర్పింతు ననుచును ||గీతములు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.