TG-4899
Telugu

ఘన భవ దుపకృతులను మాటికి నే

Ghana Bhava Dupakruthulanu Maatiki Nee

1
views
పల్లవి

ఘన భవ దుపకృతులను మాటికి నే వినుతింతును దేవ నిజసుత యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత ||ఘన||

1వ చరణం

1.  ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా (2) పారముఁదప్పిన పాతకు నగునే (2) నారడివడ నీ కది బిరుదా ||ఘన||

2వ చరణం

2.  జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా (2) ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను (2) సిలువను బొందిన శ్రేయఃకరా ||ఘన||

3వ చరణం

3.  మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నందన నా (2) యందముగా నా డెందము కడుఁదెలి (2) వొందఁగ నీ దయ నందు మా ||ఘన||