ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు ||ఘన యెహోవా||
వెలఁయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ ||ఘన యెహోవా||
తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు ||ఘన యెహోవా||
వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు ||ఘన యెహోవా||
మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము అరయఁ డిట్టులఁ జేయువాఁడే ధర నెపుడు గదల్పఁబడఁడు ||ఘన యెహోవా||
జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్ ||ఘన యెహోవా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.