TG-4902
Telugu

ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్

Ghanadeeva Puthrudagu Ghanamaina Yeesubiddan

15
views
పల్లవి

ఘనదేవ పుత్రుడగు ఘనమైన యేసుబిడ్డన్ (2) జనులారా స్తోత్రించి ముద్దులాడుడి (2) 1.  పాడుడి మళ్ళి పాడుడీ (2) పాపుల విమోచకుడు ప్రభు యేసు రక్షకుడు (2) నేడుద్భవించెను బెత్లెహేమున (2) ||ఘన||

1వ చరణం

2.  తట్టుడి కేలు తట్టుడీ (2) తండ్రియగు దేవుడిచ్చె తన యొక్క ముద్దు పాపన్ (2) నిట్టూర్పులింకేల పాపలోకమా (2) ||ఘన||

2వ చరణం

3.  చుట్టుడి ప్రేమన్ చుట్టుడీ (2) తొట్టిలోన బట్టతోను చుట్టబడ్డ యేసు పట్టిన్ (2) గట్టిగాను పాదసేవ జేయుడి (2) ||ఘన||

3వ చరణం

4.  దేవుడే తానైననూ (2) దాస్యంపు రూపమును దాల్చుకొన్న యేసునాధున్ (2) విశ్వాస ప్రేమతోను బట్టుమా (2) ||ఘన||

4వ చరణం

5.  హీనమైన దాసుడా! (2) మానవుని ఘనపర్చ దీనుడాయె ఘన యేసు (2) ప్రాణంబులన్ గూడ ప్రభుకర్పించు (2) ||ఘన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.