♪♫
TG-3411
Telugu
ఘనమగు వేడుకకు
Ghanamagu Vedukaku
0
views
పల్లవి
కరుణించి కాపాడే యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా.. కూడుకొని మనమీవేళ ఘనమగు వేడుకకు తెర తీయాలా (2) గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై ||కూడుకొని||
1వ చరణం
వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే గానమై గళమున పాడగా ధ్యానమై మనసుని తాకగా ప్రభవించె యేసు దివ్య నాద రూపాన ||కూడుకొని||
2వ చరణం
పాతవి కడ తేరగ మనసు మారిపోయే నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే స్తోత్రమే నిలువుగ లేవగా ధూపమై వరదుని చేరగా తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన ||కూడుకొని||