TG-1540
Telugu

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

goppa deevudavani shakthi sanpannudani

64
views
పల్లవి

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదన్ హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప||

1వ చరణం

అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2) అద్వితీయుడవని ఆదిసంభూతుడని ఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా||

2వ చరణం

సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా||