TG-2164
Telugu

గుండె బరువెక్కిపోతున్నది ప్రాణము సొమ్మసిల్లుచున్నది

gunde baruvekkipoothunnadi praannamu sommasilluchunnadi

75
views
పల్లవి

గుండె బరువెక్కిపోతున్నది ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2) నా మనసేమో కలవరపడుచున్నది యేసయ్యా.. ఆదరించ రావా యేసయ్యా.. బలపరచ రావా ||గుండె||

1వ చరణం

ప్రాకారము లేని పురముగా నేనుంటిని ఆదరణ లేక దిగులుతో నేనుంటిని నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే యేసయ్యా.. ఆధారం నీవే కదా యేసయ్యా.. నా కాపరి నీవే కదా అంధకారంలో నా దీపము ఆరిపోయెనే అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే దినదినము నేను కృంగుచున్నాను యేసయ్యా.. వెలిగించగ రావా యేసయ్యా.. లేవనెత్త రావా ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా యేసయ్యా.. దర్శించ రావా యేసయ్యా.. ప్రేమతో నింపుమయా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.