గురుతు చేసుకో ఓ ప్రియుడా
Guruthu Cheesukoo Oo Priyudaa
గురుతు చేసుకో ఓ ప్రియుడా గుడిలో చేసిన ప్రమాణ సూత్రము మరిచిపోకుమా ఓ ప్రియతమా మెడలో కట్టిన ఆ మంగళసూత్రం తిరగబడితే క్రీస్తు కొరడా - చెళ్ళుమంటుందీ శుద్ధీకరణ ||గురుతు||
స్వదేశీ సంస్కృతి మరిచి - విదేశీ సంస్కృతి మరిగి ఆత్మీయతను అణచి - అనురాగాన్ని విడచి పబ్ క్లబ్ తైతక్కలాడి - కాముకత్వము తలకెక్కి భార్యాభర్తల మార్పిడి చూడు కుటుంబ వ్యవస్థ దోపిడి నేడు ||గురుతు||
సాటి సహాయము మరిచి - సూటిపోటిగా పొడిచి భర్తను అనుమానించి - పిల్లల భవితను విడిచి ఇంటి గుట్టును రట్టుగ చేసి - భార్య నెదిరించి గడప దాటితే పెళ్ళి కాస్త పెటాకులై - కొంప కొల్లేరౌతుంది ||గురుతు||
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.