TG-3430
Telugu

హల్లెలూయా ఆనందమే

Halellooyaa Aanandame

0
views
పల్లవి

ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా (2) యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును (2) ||ఏ చెట్టు||

1వ చరణం

పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను నరుల పాపము తన భుజాలపై మోపుకొనెను పరమ దేవుడు (2) నమ్మిన వారై రక్షణ పొంద స్వర్గానికే చేరుకుందమా (2) ||ఏ చెట్టు||

2వ చరణం

మహిమ రూపుడే మనిషి జన్మలో – భువికి అవతరించెను సిలువ మ్రానుపై వ్రేళాడెను – రక్తము చిందించెను యేసు లేచెను మరణము గెలిచి నమ్మిన వారిని పరమును చేర్చ (2) హల్లెలూయా ఆనందమే హల్లెలూయా సంతోషమే (2) ||ఏ చెట్టు||