TG-3434
Telugu

హల్లెలూయ పాటలతో

Hallelooya Paatalatho

21
views
పల్లవి

హల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో (2) కృపామయుండా నీ మేలులన్ని స్మరించి స్తుతింతును (2) నేనారణ్యా యానములో నిను పలుమార్లు విసిగించినా (2) కోపించుచునే వాత్సల్యము చూపి అనుదినము నను మరువక మన్నాను నాకిడితివి (2) ||హల్లెలూయ||

1వ చరణం

మలినంబైన వలువలతో నే నీ ఎదుట నిలుచుండగా (2) కృపతో నా నేరములను క్షమియించి పరిశుద్ధ వస్త్రములతో నన్నలంకరించితివి (2) ||హల్లెలూయ||

2వ చరణం

నే కృంగిన వేళలలో నీ అభిషేక తైలముచే (2) పక్షిరాజు యవ్వనము వలె నా బలము నూతనము జేసితివి నను పైకెగుర జేసితివి (2) ||హల్లెలూయ||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.